Congress Chintan Shivir:ఆత్మపరిశీలనా? ఆత్మస్తుతా? | కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్‌ సభలు | ABP Desam

Continues below advertisement

మూడు రోజుల పాటు జరిగే నవసంకల్ప చింతన్‌సభలో ఆరు గ్రూపులుగా ఏర్పాటు చేసి సమకాలీన రాజకీయాలపై విశ్లేషణ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా సంస్థాగతంగా పార్టీలో మార్పులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతోపాటు సంస్థాగతంగా మార్పులు చేస్తేనే పార్టీకి భవిష్యత్‌ ఉంటుందనే భావనలో Congress Party ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధానంగా యువకులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. గడ్డు పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఆత్మపరిశీలన సభలను ఏర్పాటు చేసే Congress Party తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈసారి అదే పంథా అనుసరిస్తోంది. Rajasthanలోని Udaypur వేదికగా మూడు రోజుల పాటు జరిగే సభలు దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా..? Congress పార్టీకి పునర్‌వైభవం తీసుకొస్తుందా..? పార్టీ క్యాడర్‌కు ఈ సమావేశాల ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తుందో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram