
Chhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam
ఒకప్పుడు దక్షిణాది వంటకం గా పేరు పొందిన సాంబార్ ఇప్పుడు ఇండియా వైడ్ గా పాపులర్. సౌత్ ఇండియన్స్ పుణ్యమా అంటూ విదేశాలకు సైతం పాకి పోయింది. సాంబార్ లేని విందులు పెళ్లిళ్లు ఎక్కడా కనపడవు. అయితే ఇంతకూ సాంబార్ కా పేరు ఎలా వచ్చింది. చత్రపతి శంభాజీ మహారాజు గుర్తుగా "సాంబార్ " అనే పేరు పెట్టారనే ప్రచారంలో నిజమెంత.నిజానికి సాంబార్ తొలిసారి గా ఎక్కడ తయారైంది అన్నదానిపై ఖశ్చితమైన ఆధారాలు లేవు.కానీ కర్ణాటకకు చెందిన ప్రముఖ ఫుడ్ హిస్థారియన్ KT అచయా ( 1923-2002) ప్రకారం సాంబార్ కు మూలం కన్నడ వంటకం "హులి " లో ఉంది. 1648 CE లో కన్నడ విద్యావేత్త గోవింద వైద్య రచించిన " కంఠీరవ నరసరాజ విజయ " అనే గ్రంథంలో కందిపప్పు, కూరగాయలు కలిపి వండే సాంబార్ లాంటి వంటకం "హులి " గురించిన ప్రస్తావన ఉంది. "హులి " మాటకి అర్థం పులుపు అని. తంజావూర్, మరాఠా ప్రాంతాల్లో మరొక సంప్రదాయం ప్రచారంలో ఉంది. చత్రపతి శంభాజీ మహారాజ్ ఒకసారి మరఠా సంప్రదాయ వంట "ఆమ్తి " (పప్పు ధాన్యాలతో చేసే సూప్ ) లో కొన్ని మార్పులు చేశారు. అందులో వాడే 'కోకుమ్ పండు " కు బదులుగా చింతపండు రసం, కూరగాయలు చేర్చి క్రొత్త వంటకాన్ని తయారు చేశారు. మొఘలుల చేతిలో ఆయన 1689 లో హత్యకు గురయ్యాక ఆయన జ్ఞాపకార్థం శంభాజీకి తమ్ముడు వరసయ్యే తంజావూర్ మహారాజు సాహు (1684-1712) ఈ వంటకానికి సాంబార్ అనే పేరు పెట్టినట్టు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది పాకశాస్త్ర నిపుణుడు సౌరిష్ భట్టాచార్య తన 2023 నాటి పుస్తకం "the Bloomsbury Handbook of Indian Cuisine " అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు. నిజానికి శంబాజీ,సాహూల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి కాదు. కానీ శంభాజీ మరణం తర్వాత రెండు రాజ్యాల మధ్య సత్సంబంధాల కోసం సాహు సాంబార్ ను వాడుకున్నట్టు ఆయన తన పుస్తకంలో రాశారు. 20వ శతాబ్దం నాటికి మిగిలిన దక్షిణాది వంటకాలతో పాటుగా సాంబార్ కూడా శ్రీలంక ప్రజలకు సైతం పరిచయమైంది.