Delhi Railway Station Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పెను విషాదం | ABP Desam

 ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పెను విషాదం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే రైళ్లు ఎక్కేందుకు భక్తులు ఒక్కసారిగా దూసుకు రావటంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. 14వ నెంబర్ ఫ్లాట్ ఫాంపై ఉన్న ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ఎక్కేందుకు 12,13,14 నెంబర్ ఫ్లాట్ ఫాంలపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా దూసుకురావటంతో ఈ దుర్ఘటన జరిగింది. తొక్కిసలాటలో 18మంది ప్రయాణికులు మృతి చెందారు. చనిపోయిన వారిలో 11మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్‌భ్రాంతి ని వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సహా ఉన్నతాధికారులంతా రైల్వే స్టేషన్ ను కు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. తొక్కిసలాట విజువల్స్ అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన 30మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola