Breaking News: సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేద్దామనుకున్న వ్యవసాయ సంస్కరణ చట్టాలు మూడు. మొదటిది నిత్యవసర సరకుల చట్టం అంటే ది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం- 1955కి కొన్ని సవరణలు చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. రెండోది 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టం' అంటే ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్. మూడోది రైతుల సాధికారత, రక్షణ ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020 అంటే ది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ - 2020.