Mirchi Farmers: ఐదేళ్లు గడిచినా కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న అన్నదాతలు
వాళ్లు దొంగలు కాదు.. రౌడీలు కాదు.. కరుడుగట్టిన నేరస్తులు అంతకన్నా కాదు. వీరు రైతులు.. వారు పండించింన మిర్చి పంటకు తగిన ధర అడిగినందుకు వారిపై నేరపూరిత కుట్ర కేసులు పెట్టి.. వారానికి పైగా జైలులో పెట్టి.. బేడీలు వేసి కోర్టులో హాజరు పరిచారు.