Bihar Snake: పాముతో పరాచకాలు.. రాఖీ కట్టీ ఆశీర్వదించాడు.. తర్వాత ప్రాణాలే పోయాయి..
పాములతో విన్యాసాలు ప్రాణాంతకం. ఈ విషయం తెలిసినా చాలా మంది ఏం కాదన్న ధీమాతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే బిహార్‌లోని మాంజీసీతల్‌పుర్‌లో జరిగింది. పాములు పట్టే వ్యక్తి చేసిన పని ఆయన ప్రాణాలు తీసింది. మన్మోహన్ అలియాస్ భూవర్ పాముకే రాఖీ కట్టాడు. రెండు పాములతో ఆయన చేసిన విన్యాసం వికటించింది.