బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

Continues below advertisement

దీపావళి రోజు రాత్రి బెంగళూరులో యువకులు ప్రమాదకర రీతిలో కాసుకున్న పందెం ఓ యువకుడి ప్రాణం తీసింది. konanakunte వీవర్స్ కాలనీలో 32 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. తన ఫ్రెండ్స్ ‌తో కాసిన ప్రమాదకర పందెం ప్రకారం.. ఆ యువకుడు తోటి ఫ్రెండ్స్ బలవంతంపైన దీపావళి టపాసుపై కూర్చున్నాడు. వారిలోని ఓ వ్యక్తి దాన్ని అంటించాడు. కాసేపటికి అది తీవ్రంగా పేలింది. ఇదంతా పక్కింట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అతను కూర్చొన్న బాంబు పేలగానే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కింద పడిపోయిన అతను కొన్ని క్షణాలకే స్ప్రహ కోల్పోవడం సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై సౌత్ బెంగళూరు డీసీపీ స్పందిస్తూ.. ఘటన జరిగిన సమయంలో బాధితుడితోపాటు స్నేహితులందరూ మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు. ఈ పందెంలో గెలిస్తే తన ఆటో ఇచ్చేస్తానని రెచ్చగొట్టడంతో బాధితుడు ఈ ప్రమాదకర పందెం ఒప్పుకున్నాడని చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram