Amitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABP
అసెంబ్లీలో కేంద్రహోంమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ మధ్య ప్రతీ దానికి అంబేడ్కర్ అంబేడ్కర్ అంటూ నినాదాలు చేయటం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని దానికి బదులు దేవుడిని తలుచుకుంటే ఏడు జన్మల పాటు స్వర్గానికి చేరుకునేంత పుణ్యం అయినా వస్తుందన్నారు అమిత్ షా.ఈ వ్యాఖ్యలపై పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. పార్లమెంటులో అమిత్ షా అంబేడ్కర్ పై మాట్లాడిన తీరు సిగ్గు చేటంటూ తక్షణమే ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ అంబేడ్కర్ ఫోటోలతో కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంటు ముందు ఆందోళనకు దిగారు. అమిత్ షా మాటలు బీజేపీ ప్రభుత్వం మనసులో మాటలన్నారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని మార్చేయాలని..అంబేడ్కర్ ఆశయాలను నీరుగార్చాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమిత్ షా కామెంట్స్ పై కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది.