పనామా పేపర్ల కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్య రాయ్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. పన్నులను ఎగవేసేందుకు దీవుల్లో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఇంతకుముందే ఐశ్వర్య రాయ్ హాజరుకావాల్సి ఉండగా వాయిదా వేయాలని ఈడీని కోరింది. ఈసారి మాత్రం ఆమె తప్పక హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఆమెను విచారించనుంది ఈడీ.