ఓటరు కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ చేసేలా లోక్ సభలో బిల్లు ఆమోదం
ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల కోసం, బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.