Ahmedabad Plane Crashed a Residential Building | నివాస భవనాన్ని ఢీకొట్టిన విమానం | ABP Desam
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కుప్ప కూలింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ A 171 విమానం. ఎయిర్ పోర్ట్ పక్కనే ఉండే మేఘాని నగర్ లోని ఓ భవంతిని ఢీకొట్టింది విమానం. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, 10మంది విమాన సిబ్బంది, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారు. విమానం నివాస సముదాయాన్ని ఢీకొట్టగానే భారీ పేలుడు సంభవించగా దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. విమానం ఢీకొట్టిన భవంతి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ భవనంలో ఎవరైనా నివసిస్తున్నారా అన్న విషయాలు ఇంకా తెలియరావటం లేదు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా...వారిలో 169మంది భారతీయులు కాగా...53మంది బ్రిటీషర్లు, పోర్చుగల్ దేశానికి చెందిన 7గురు, ఓ కెనడా దేశస్థుడు ఉన్నారు. మృతుల సంఖ్య ఎంత అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.