Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ లో ఘోర విమానం ప్రమాదం..ఫ్లైట్ లో 242 మంది | ABP Desam
అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా కు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 విమానం టేకాఫ్ క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. మేఘాని ప్రాంతంలో జనావాసాలపై విమానం కూలిపోయింది. విమానం నేలకొరిగిన క్షణాల వ్యవధిలోనే భారీ మంటలు చెలరేగాయి. ఎయిర్ ఇండియా బీ787 ఎయిర్ క్రాఫ్ట్ వీటీ ఎన్ఎన్ బీ అనేది ఈ విమానం మోడల్. 300మంది ప్రయాణికులు జర్నీ చేసే వీలుండే ఈ విమానంలో ప్రమాద సమయంలో ఏకంగా 242 మంది ఉండటమే ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం జరిగిన చోట దట్టంగా పొగ అలుముకోవటంతో చాలా సేపు సహాయకచర్యలు సాధ్యపడలేదు. ఇప్పుడు చూస్తే మొత్తం ఆ ప్రాంతమంతా విమానం కాలి బూడిదైన శకలాలే కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రయాణికులకు ఏమైందన్న ఆందోళనే సర్వత్రా నెలకొంది. విమానం ఉన్నపళంగా కుప్ప కూలి పోయి పేలిపోయిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.