అంతర్జాతీయ న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం
అంతర్జాతీయ న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్‌గా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ నియామకమని వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోన్న వార్తలో నిజమెంతో చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు.. ఏదో ఒక గ్రూప్‌లో కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో చాలా మందికి తెలియదు. తెలియకుండానే వాటిని మళ్లీ ఫార్వార్డ్ చేస్తాం. కానీ ఇందులో ఒక్కోసారి చాలా సున్నితమైన, న్యాయవ్యవస్థకు, దేశ భద్రతకు, శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించే వార్తలు కూడా వస్తాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తాజాగా ఈ వార్త కూడా వాట్సాప్‌లో తెగ సర్క్యులేట్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతో చూద్దాం.