Fact Check: అయ్యప్ప ప్రసాదం టెండర్‌ను కేరళ ప్రభుత్వం అరబ్ కంపెనీకి ఇచ్చిందా?
శబరిమల ప్రసాదం తయారీ టెండర్ అల్ జహా స్వీట్స్ అనే యూఏఈ కంపెనీకి ఇచ్చినట్లు వస్తున్న వార్తలు నకిలీ వార్తలు. ప్రస్తుతం ఉన్న అరవన ప్రసాదం కంటైనర్‌కు, కంపెనీ ప్యాకేజింగ్‌కు చాలా తేడా ఉంది. ఈ క్లెయిమ్ తప్పు అని దేవస్థానం బోర్డు చెబుతోంది. కొన్ని చోట్ల అరవన పాయసం అనే పేరుతో కంపెనీలు స్వీట్‌లను అమ్ముతున్నాయి. దుబాయ్‌లో ఆన్‌లైన్‌లో కూడా దీన్ని విక్రయిస్తున్నారు. ఫోటోను జాగ్రత్తగా గమనించినట్లైతే, దానిపై అరవన పాయసం అని ఉంది, అరవన ప్రసాదం అని కాదు. అసలైన అరవన ప్రసాదంతో కనుక ఈ ఫోటోను పోల్చి చూస్తే 'ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు' అని కానీ శరణం అయ్యప్ప అని గానీ లేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త పూర్తిగా ఫేక్ న్యూస్.