IND VS SA: మిడిలార్డర్ ఫెయిల్ అవటంతో తొలి వన్డేలో చతికిలపడిన భారత్
Continues below advertisement
టెస్ట్ సిరీస్ ఓటమితో వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంటారనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడియాసలు చేస్తూ తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికా విధించిన 297 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక యాభై ఓవర్లలో 265 పరుగులకే పరిమితమైంది. కొహ్లీ, ధవన్ లు అర్థసెంచరీలతో రాణించినా....శార్దూల్ ఠాకూర్ చివరిలో ఒంటరిపోరాటం చేసినా...మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావటంతో భారత్ కు ఓటమి తప్పలేదు. అంతకు ముందు సఫారీ బ్యాటర్లు బవుమా, వాన్ డర్ డుసెన్ సెంచరీలతో కదం తొక్కటంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీస్కోరు సాధించింది. సిరీస్ లో రెండోవన్డే శుక్రవారం జరగనుంది.
Continues below advertisement