IND VS SA: రెండో టెస్టు లో గెలిచి చరిత్ర సృష్టించాలని సాధన చేస్తున్న టీమిండియా
రెండో టెస్ట్ లోనూ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. సౌతాఫ్రికాను సొంతగడ్డపై ఓడించి సిరీస్ విజయమంటూ లేని భారత్....సెంచూరియన్ లో జరిగిన తొలిటెస్టులో సఫారీ జట్టును వణికించింది. ప్రత్యేకించి భారత బౌలర్ల ధాటికి రెండు ఇన్సింగ్స్ లోనూ రెండొందల పరుగుల మార్కును దాటలేక సఫారీ ఆటగాళ్లు ఆపసోపాలు పడ్డారు. ఇదే ఊపులో రెండో టెస్టులోనూ సౌతాఫ్రికాను చుట్టేయటం ద్వారా గతంలో ఎన్నడూ లేని చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నారు టీమిండియా ఆటగాళ్లు.