ICC ODI Rankings: టాప్ 2,3 స్థానాల్లో విరాట్, రోహిత్. టాప్ ఫైవ్ లోకి క్వింటన్ డి కాక్!

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 229 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్ ఐసిసి ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక వన్డే సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం లో కొనసాగుతున్నాడు. గాయం కారణంగా వన్డే సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ మూడో స్థానం లో కొనసాగుతున్నాడు. ఇక వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ వాన్ డెర్ డస్సెన్ 218 పరుగులు చేసి 10 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ సిరీస్‌లో 169 పరుగులు చేసి 15వ స్థానానికి చేరుకున్నాడు . పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌లో బాబర్ ఆజం మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. .

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola