ICC Men’s Cricketer of the Year: షాహీన్ అఫ్రిదికి ప్రతిష్ఠాత్మక అవార్డు
Continues below advertisement
ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ -2021గా పాకిస్థాన్ యువ పేసర్ Shaheen Shah Afridi నిలిచాడు. సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందుకోనున్నాడు. 2021లో ఆడిన 36 అంతర్జాతీయ మ్యాచుల్లో 22.20 సగటుతో షాహిన్ 78 వికెట్లు పడగొట్టాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో నిప్పులు చెరిగాడు. రోహిత్, రాహుల్, కోహ్లీ వికెట్ల సాధించాడు. స్వింగ్, సీమ్, ఎక్స్ ప్రెస్ పేస్, యార్కర్లతో ఏడాదంతా షాహిన్ సత్తా చాటుతూ వచ్చాడు.
Continues below advertisement