హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్
హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు, సివి ఆనంద్. హైదరాబాద్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.హైదరాబాద్ కమిషనర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. మెట్రోపాలిటన్ సిటీ లో శాంతి భద్రతలు చాలా ముఖ్యం అన్నారు.డిసిపి గా 2001 నుండి సెంట్రల్ జోన్ లో పని చేసిన ఆనంద్, అడిషనల్ సిపి ట్రాఫిక్ గా, సైబరాబాద్ సీపీ గా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనర్ గా నియమితులైనందుకు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.