Hyderabad: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్యాస్ లీకేజీ
హైదరాబాద్ లోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గాయత్రీ టవర్ వద్ద తాగునీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఏర్పడింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమీపంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను దారి మళ్లించారు. గ్యాస్ పైప్ లైన్ ఉందని హెచ్చరించినప్పటికీ... గాయత్రీ టవర్ నిర్మాణ సంస్థ వారు తవ్వకాలు జరపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.