లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలు

డ్రోన్‌లు, యుద్ధ ట్యాంక్‌లు, సబ్‌మరైన్‌లు. ఇవన్నీ ప్రతి దేశం దగ్గరా ఉండొచ్చు. కానీ...ఇజ్రాయేల్ లెక్క వేరు. అడ్వాన్స్‌డ్ డిఫెన్స్‌ సిస్టమ్‌ని తయారు చేసుకుంది...ఈ దేశం. హమాస్‌తో యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి ఇజ్రాయేల్ పేరు..గట్టిగానే వినిపిస్తోంది. కానీ.. ఈ సారి మాత్రం ఈ సౌండ్‌ కాస్త ఎక్కువగానే ఉంది. అందుకు కారణం...పేజర్స్ పేలుళ్లు. హెజ్బుల్లా అధీనంలో ఉన్న లెబనాన్‌లో... వేలాది పేజర్‌లు వరుస పెట్టి పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా..దాదాపు 2 వేల 8 వందల మంది గాయపడ్డారు. ఈ పేజర్‌ల పేలుళ్లకు..ఇజ్రాయెలే కారణమని హెజ్బుల్లా తేల్చి చెబుతోంది. కానీ...ఇజ్రాయేల్ మాత్రం దీనిపై ఇప్పటి వరకూ రెస్పాండ్ అవలేదు. హెజ్బుల్లా యూజ్ చేస్తున్న పేజర్స్‌తో పాటు వాకీటాకీలూ పేలడం...ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. 

మొబైల్‌ని పెద్దగా వాడని రోజుల్లో....అంటే... 1980,90ల్లో కమ్యూనికేషన్ కోసం వాడిన డివైజ్‌లే..ఈ పేజర్స్. అయితే...వీటితో వాయిస్ కాల్స్ మాట్లాడడానికి వీలుండదు. జస్ట్ మెసేజ్‌లు మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. పాకెట్‌ సైజ్‌లో ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నార్న లొకేషన్ ట్రేస్ అవదు. ఇజ్రాయేల్‌ కంటపడకుండా...హెజ్బుల్లా పెద్ద ఎత్తున వీటిని వాడుతోంది. ఈ పేజర్స్ అన్నీ...తైవాన్ నుంచి వచ్చాయి. ఇజ్రాయేల్‌ వీటిని ట్యాంపరింగ్ చేసి పేల్చేసినట్టు కొంతమంది వాదిస్తున్నారు. ఈ పేజర్స్‌ తయారయ్యే సమయంలోనే...అందులో పేలుడు పదార్థాలు పెట్టించి...ఈ దాడులు చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola