పలాసలో ఉద్రిక్తంగా పరిస్థితులు, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా పలాస లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక శ్రీనివాస నగర్ లోని 52 ఇళ్ల కూల్చివేతకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. JCBలతో ఇళ్ల కూల్చివేత కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. మంత్రి అప్పలరాజుపై విమర్శలు చేశారన్న కక్ష్యతోనే... టీడీపీ నేత గురిటి సూర్యనారాయణకు చెందిన నాలుగు ఇళ్లను టార్గెట్ చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో TDP కార్యకర్తలకు మద్దతుగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అక్కడికి వచ్చారు. ఐతే.. కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతున్న ఎమ్మెల్యే అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.