యూపీలోని షాహీ మసీద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
యూపీలోని సంబాల్ ప్రాంతంలో షాహీ మసీద్ వద్ద ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగిన ఘర్షణలో ఇప్పటి వరకూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మసీదులో సర్వేని వ్యతిరేకిస్తూ...ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, చెప్పులు విసిరారు. పోలీసులు కూడా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి రేగింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజీలు మూసేశారు. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అంతకు ముందు మసీదు ఉన్న ప్రాంతంలో ఆలయం ఉండేదని, దాన్ని కూలగొట్టి మసీదు కట్టించారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం...సర్వేకి అనుమతినిచ్చింది. మసీదు లోపల ఆలయ ఆనవాళ్లు ఉన్నాయా అన్న కోణంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు ఇంటర్నెట్ సర్వీస్‌ని నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమిగూడి తిరగొద్దని హెచ్చరించారు. అంతే కాదు. చేతిలో రాళ్లు, బాటిల్స్ పట్టుకుని తిరిగినా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ పోలీస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే...ఇండీ కూటమి నేతలే కావాలని ఇదంతా చేయిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.