గుట్కా తినమని బలవంతం, ప్రాణాలు తీసిన వేధింపులు
కరుణపురంలోని ఎంజిపి ప్రభుత్వ హాస్టల్ లో దారుణం చోటు చేేసుకుంది. ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. మొదటి సంవత్సరం చదువుతున్న భరత్ ని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా తీసుకురావాలంటూ బలవంతం చేస్తుండటంతో విద్యార్థి తీసుకురాగా వాచ్ మెన్ ఫోటోలు తీశారని...దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.