Guntur Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్ కు రక్షణ ఏర్పాటు..!| ABP Desam
గుంటూరు నగరపాలక సంస్థ... జిన్నా టవర్ కు పగడ్బందీగా రక్షణ వలయం నిర్మించింది. గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు,డిప్యూటీ మేయర్ షేక్ సజీల... ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ మతతత్వాన్ని పెంచి పోషించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.గుంటూరు నగర వాసులు కులమతాలకు అతీతంగా... సోదర భావంతో కలసిమెలిసి జీవనం సాగిస్తూ ఉంటే... రాజకీయ లబ్ధి కోసం... జిన్నా టవర్ పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని...బీజేపీ చూస్తోందన్నారు. గుంటూరు నగరం లో ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని మేయర్ స్పష్టం చేశారు.జిన్నా టవర్ పూర్తిగా రక్షణ వలయం లో ఉందని వివరించారు.