Guntur :UTF చలో CMO నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం | ABP Desam
UTF ఉపాధ్యాయులు చలో సీఎం కార్యాలయం నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీ లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లు, బస్ స్టేషన్ లలోకి వెళ్లే వారిని ఐడీ కార్డులు చెక్ చేసి మాత్రమే పంపుతున్నారు. మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.