Gravel Mining: అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న తెదేపా నేతలు
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని గొల్ల కందుకూరులో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. నెల్లూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో పంచభూతాలనూ దోచుకుని తినడమే పనిగా మారిందని ధ్వజమెత్తారు.అక్రమ సంపాదనతో ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మూటలకొద్దీ డబ్బు వెదజల్లుతున్నారని విమర్శించారు.