Bandi Sanjay- PM Modi: తెలంగాణలో పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. తెలంగాణలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. మొత్తం మీద 15 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. 317 నంబర్ జీవోపై అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా దాడి చేయడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను ప్రస్తావించారు. సంజయ్ పోరాటాన్ని మెచ్చుకున్నారు. ప్రజాసమస్యలపై ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా తప్పులేదన్నారు. ఓ ఎంపీ కార్యాలయంపై దాడిని ఖండించారు. సంజయ్ కుటుంబీకులకు ధైర్యం చెప్తూనే, గాయపడ్డ కార్యకర్తలకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.