Govt Employes Dharna On PRC: పీఆర్సీ పై పునరాలోచించండి..లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం..
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ లను ముట్టడించారు. ఫిట్ మెంట్ పై పునరాలోచించడం...హెచ్ ఆర్ఏ సవరణ...సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహించారు ఉద్యోగులు. కలెక్టరేట్ ల దగ్గర ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల ఉద్యోగ సంఘం నేతలను అరెస్ట్ చేయటంతో ఆందోళనలు మరింత ఉద్ధృతం అయ్యాయి.