Govt Employees on PRC : మంత్రుల కమిటీతో మాకేంటి ఉపయోగం,మళ్లీ అదే చెబుతారంటున్న ఉద్యోగులు
క్యాబినెట్ లో పీఆర్సీ జీవోలకు క్యాబినెట్ ఆమోదం తెలపటంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సమ్మెకు వెళ్లేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్న ఉద్యోగ సంఘాలు....ప్రభుత్వానికి ఇంత సమయం ఇచ్చినా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయారని విమర్శిస్తున్నాయి. ఇక ఉద్యమంలోకి వెళ్లక తప్పేలా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...అదే జరిగితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు.