IDOLS: సెంటిమెంట్ విగ్రహాలు దొరకడంతో గ్రామస్దుల హర్షం
సహజంగా దొంగల ముఠాని పట్టుకున్నప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు, వారిని మీడియాకి చూపించి రిమాండ్ కి తరలిస్తారు. కానీ నెల్లూరులో మాత్రం దొంగల ముఠాని పట్టుకున్న పోలీసుల ప్రెస్ మీట్ కాస్త వెరైటీగా సాగింది. దొంగలు తీసుకెళ్లింది స్వామివారి పంచలోహ విగ్రహాలు కావడం, అవి ఆ ఊరికి సెంటిమెంట్ కావడంతో.. ఆ ఊరి పెద్దలు, నాయకులు, ఆలయ పూజారులు కూడా తరలి వచ్చారు. విగ్రహాలు దొరికినందుకు ఎస్పీని అభినందించారు.