GO 317- Minister Sabita: మంత్రి సబితా ఇంద్రారెడ్డికి భాజపా నిరసన సెగ
రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా తాండూరుకు వచ్చిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి భాజపా నిరసన సెగ తగిలింది. జీవో 317ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బండి సంజయ్ ది అక్రమ అరెస్ట్ అంటూ ఆందోళన చేశారు. కాన్వాయ్ ను అడ్డుకున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు తెరాస, భాజపా శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్ అత్యుత్సాహం ప్రదర్శించినట్టు స్థానికులు చెబుతున్నారు