Gnananda Ashramam: అక్రమ చెర నుండి మృత్యు ఒడిలోకి గోవులు..!
విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో రెండు రోజుల్లో 17 గోవుల మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.శ్రీకాకుళం నుండి హైదరాబాద్ అక్రమంగా తరలిస్తున్న 160 గోవుల్ని ఇక్కడి ఆశ్రమానికి తరలించి పోలీసులు చేతులు దులుపుకొన్నారు. అప్పటికే ఇక్కడ ఉన్న గోవులకు ఇవి కూడా తోడవడంతో వాటికి కావాల్సిన నీరు,ఆహారం అందించలేకపోయారు.దీంతో వరుసగా ఆకలితో గోవులు మృతి చెందుతున్నాయి.