Freedom Day: జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఫ్రీడం డే సంబరాలు
అనంతపురం జిల్లా తాడిపత్రి లో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఫ్రీడం డే సంబరాలను నిర్వహించారు. కార్యకర్తలపై దాడి చేసి వెళ్ళినా మనోధైర్యంతో ముందడుగు వేశామని ప్రభాకర్ రెడ్డి గుర్తు తెచ్చుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునిసిపల్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేశామన్నారు. ఈ సంధర్భాన్ని పురస్కరించుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.