Chittoor: చిత్తూరు లో సెల్ టవర్ ఎక్కి యువకుని హల్చల్
చిత్తూరు జిల్లా ,మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని డిఎస్పి కార్యలయంకు ఎదురుగా ఉన్న సెల్ టవర్ ను ఎక్కి క్రాంతి అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు. దీనిని గమనించి స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు క్రాంతిని సెల్ టవర్ నుంచి దించే ప్రయత్నం చేశారు.తమ కష్టం సబ్ కలెక్టర్ కే చెప్పుకుంటానంటూ సబ్ కలెక్టర్ వచ్చేంత వరకూ తను టవర్ దిగ్గేది లేదని బెదింపులకు దిగాడు. తన భార్య కాపురానికి వచ్చేవరకు దిగనని తేల్చిచెప్పాడు.దీంతో ఘటన స్ధలంకు క్రాంతి భార్య,అత్తను పిలిపించిన పోలీసులు హామీ ఇవ్వడం తో సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. దింతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.