ఆన్ లైన్ లో Formula E world Championship టిక్కెట్లు | DNN | ABP Desam
హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫార్ములా ఈ-వరల్డ్ ఛాంపియన్ షిప్ రేస్ కు రంగం సిద్ధమౌతుంది. ఫిబ్రవరి 11న నుంచి జరిగే ఈ కార్ రేసింగ్ పోటీలకు 22వేల 500 టిక్కెట్లను ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చాయి. టిక్కెట్స్ సేల్ ను ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ప్రారంభించారు. టిక్కెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. వెయ్యి రూపాయలనుంచి 10వేల రూపాయలవరకు టిక్కెట్ రేట్లు ఉన్నాయి. కార్ రేస్ పోటీలను ప్రత్యక్ష్యంగా వీక్షించేలని వారికోసం హైదరాబాద్ సిటీలో భారీ స్క్రిన్ ల ద్వారాలైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. టాప్ ఎండ్ 10 కార్ల కంపెనీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.