Fishermen Fight: మళ్లీ రింగు వలల వివాదం...
విశాఖలో మరోసారి రింగు వలల వివాదం భగ్గుమంది. పెదజాలరిపేట, ఎండాడ గ్రామాల మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. సముద్రంలో ఉండగానే... ఓ రింగ్ వల బోటును సంప్రదాయ మత్స్యకారులు తగులబెట్టారు. బోటు దగ్ధమైంది. ఎండాడ గ్రామంలోకి చొరబడ్డ పెదజాలరిపేట మత్స్యకారులు.... రింగ్ వలలను ధ్వంసం చేశారు. రింగు వలల వాడకంతో సంప్రదాయ మత్స్యకారుల ఉపాధిపై దెబ్బకొడుతున్నారని పెదజాలరిపేట మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సముద్ర తీరాన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులను భారీగా మోహరించారు.