మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో నకిలీ నోట్ల చలామణి కలకలం

Continues below advertisement

గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామంలో ఈనెల 22వ తేదీన ఒక వైన్ షాప్ లో ఇద్దరు వ్యక్తులు మూడు 200 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశారు.అయితే మూడు నోట్లు నకిలీ కావడంతో వైన్ షాప్ గుమస్తా మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో ఈ నెల 26వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా... పేరేచర్ల గ్రామంలో జెట్టి కిషోర్,పంతగాని పూర్ణచంద్రరావు,దేవళ్ళ శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకొని... విచారించగా, దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన వెంకట నారాయణరెడ్డి,షేక్ జానీ భాష,జంగం శ్రీనివాసరావు లు... గుంజి అంకమరాజు అనే కమిషన్ ఏజెంట్ ద్వారా జేట్టి కిషోర్,పంతగాని పూర్ణచందర్రావు, దేవళ్ళ శ్రీనివాస్ లకు... ఒక అసలు నోటుకు... నాలుగు నకిలీ నోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.ఈ నేపథ్యంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ పోలీసులకు చిక్కారు. మీడియా సమావేశంలో నిందితులను... స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీని హాజరు పరిచి... వివరాలను అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ వెల్లడించారు.నిందితులలో జంగం శ్రీనివాసరావు నకిలీ నోట్లను తయారు చేయడం లో దిట్ట అని... గతంలో ఇతని పై కేసులు ఉన్నాయన్నారు.నిందితుల వద్ద నుంచి నకిలీ కరెన్సీ తోబాటు,వాటి తయారీకీ ఉపయోగించే స్కానర్ ,ప్రింటర్, జిరాక్స్ మిషన్ రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram