నెల్లూరులో విధులను బహిష్కరించి ఆందోళనకు దిగిన ఉద్యోగులు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు విధులను బహిష్కరించి MPDO ఆఫీస్ ల వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని... ప్రొబేషన్ ను వెంటనే డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేకపోయినా... తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సి వచ్చిందని ఉద్యోగులు తెలిపారు. కోవూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు.