మైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా అదుపు తప్పి అటూ ఇటూ పరుగులు పెట్టాయి. బ్యారికేడ్‌లపై దూసుకెళ్లాయి. ఈ ఘటనలో బ్యారికేడ్‌లు చెల్లాచెదురయ్యాయి. అవి బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారి. అయినా రెండు ఏనుగులు ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చాయి. రద్దీగా ఉండే రోడ్డుపైకి వెళ్లడం వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఎటు పడితే అటు పరుగులు పెట్టాయి. దాదాపు గంట పాటు ఎవరికీ చిక్కకుండా తప్పించుకున్నాయి. చివరకు మరో ఏనుగు సాయంతో ఎంతో కష్టపడి పట్టుకున్నారు. అక్టోబర్ 12వ తేదీన మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే 11 ఏనుగులను ప్యాలెస్‌కి తీసుకొచ్చారు. వాటితో కవాతు చేయిస్తున్నారు. రాత్రి పూట వాటికి ఆహారం అందిస్తారు. ఆ సమయంలోనే ఈ సంఘటన జరిగింది. రెండు ఏనుగులూ కొట్లాడుకున్నాయి. వాటిని అదుపులోకి తీసుకొచ్చేలోగా ఇలా అలజడి సృష్టించాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola