Elephant: బంగారుపాళ్యం మండలం, మొగిలిలో ఏనుగులు హల్ చల్.
తిరుపతి, బంగారుపాళ్యం మండలం, మొగిలిలో ఏనుగులు హల్ చల్ చేసాయి.. మొగిలి ఘాట్ లోని శ్రీని ఫుడ్స్ పరిశ్రమలోకి నిన్న అర్ధరాత్రి ఏనుగులు చొరబడ్డాయి.. పరిశ్రమలో ఉన్న టమోటా ట్రేలను తొక్కి ధ్వంసం చేసాయి..ఏనుగులను చూసి అప్రమత్తంమైన పరిశ్రమ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖా సిబ్బంది, ఏనుగులను కౌండిన్య అటవీ ప్రాంతంలోకి పంపివేశారు..