Election Commission Of India :ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షడ్యూల్ విడుదల

Continues below advertisement

ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. యూపీలో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram