Eetala rajendar: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే జైళ్లలో పెడుతున్నారు
రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన జీవో నెంబరు 317ను సవరించాల్సిందేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో పర్యటించిన ఆయన మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను పరామర్శించారు. ప్రజల తరపున పాలక పక్షాన్ని ప్రశ్నించినందుకే బండి సంజయ్, బొడిగే శోభలను పోలీసులు అత్యంత దారుణంగా అరెస్టులు చేశారన్నారు. ఉద్యోగులను స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని...30-35 సర్వీసులో ఉండే ఉద్యోగులతో పెట్టుకుంటే వాళ్లే ప్రభుత్వాన్ని నేలకు దింపుతారన్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని టీఆర్ఎస్ ఎగిరితే....కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని మరిచిపోవదన్నారు.