East Godavari: బ్రహ్మపురిలో కులవివక్షతో విద్యార్థులను వేరు చేస్తున్నారంటూ ఆరోపణలు
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని బ్రహ్మపురిలో ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులను కులవివక్ష చూపిస్తూ మరో పాఠశాలకు తరలిస్తున్నారని స్థానికులు నిరసన తెలిపారు. ఎంతో కాలంగా ఉన్న ప్రాథమిక స్కూల్ లో అన్ని వసతులు ఉన్నా కుల ప్రాతిపదికన వేరే పాఠశాలకు పంపిస్తున్నారంటూ స్థానికులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను వేరు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.