Director sukumar: నేను అల్లు అర్జున్ ను తక్కువ అంచనా వేశా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్ పొటెన్షెయల్ ఉన్న నటుడన్నారు. తొలుత పుష్ప క్యారెక్టర్ ప్లే గురించి తనకు సందేహాలున్నా...అల్లు అర్జున్ ని తక్కువ అంచనా వేసినా...వాటిన్నంటినీ బద్దలు కొట్టేలా బన్నీ చెలరేగిపోయాడన్నారు. పుష్పతర్వాత పుష్ప వెబ్ సిరీస్ తీస్తానని ప్రకటించారు సుకుమార్.