Director RGV: హీరోలను చూడటానికే సినిమాకి వస్తారు...అందుకే అన్ని కోట్ల రెమ్యూనరేషన్
Continues below advertisement
వినోదం, సినిమా నిత్యావసర వస్తువులు కాదని..పేదలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం ప్రభుత్వం చెప్పటానికి రాజ్యాంగంలో స్కోప్ ఎక్కడుందో చెప్పాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై తీసుకుంటున్న నిర్ణయాలను సూటిగా ప్రశ్నించిన ఆర్జీవీ...తయారు చేసే వస్తువులపై ప్రభుత్వాలే ధరలు నిర్ణయిస్తామన్నప్పుడు...ఏ తయారీ దారు ముందుకు వస్తాడని ప్రశ్నించారు. కేవలం హీరోలను చూడటానికి ప్రేక్షకులు సినిమాకి వస్తారన్న ఆయన అందుకే వాళ్లకి అన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుందన్నారు.
Continues below advertisement