Director RGV: రాజమౌళి నమ్మకం నుంచి పాన్ ఇండియా సినిమాలు పుట్టాయి
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సినిమా తయారు చేసుకున్నవాడికే దాని ధర ఎంతో డిసైడ్ చేసే హక్కు ఉంటుందన్నారు. తన సినిమాపై నమ్మకం ఉంది కనుకే రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు ఆద్యుడయ్యాడని ఆర్జీవీ అన్నారు. ప్రపంచపటంలో తెలుగు సినిమాను నిలబెట్టిన ఘనత రాజమౌళిదే అన్న ఆర్జీవీ....ఒకవేళ అది విఫలమై ఉంటే ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించేదా అని ప్రశ్నించారు.