DILIP SURANA: సోషల్ మీడియాలో డోలో పాపులారిటీ చూసి షాకయ్యానన్న మైక్రోల్యాబ్స్ సీఎండీ
సోషల్ మీడియాలో డోలో కి వస్తున్న పాపులారిటీ అస్సలు ఊహించలేదని మైక్రో ల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా తెలిపారు. మనీ కంట్రోల్ అనే వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన సురానా....బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న మైక్రోల్యాబ్స్ కు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గించే మాత్రగానే డోలోను తయారు చేస్తున్నామన్న సురానా....థర్డ్ వేవ్ లో ఎక్కువమందికి వస్తున్న లక్షణాలు ఇవే కావటంతో డోలో పనిచేస్తోందని విశ్వసిస్తున్నామన్నారు. కానీ డోలో కి వస్తున్న పాపులారిటీ చూస్తుంటే ఆనందంగా ఉందన్న సురానా...డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నే ఫాలో అవమనీ ఇప్పటికీ చెబుతున్నామన్నారు.