Dharmana Krishnadas: అమరవీరుల మృతికి సంతాపంగా శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీ

దేశరక్షణలో అలుపెరుగని పోరాటాలు చేసి...హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవానులకు మరణం ఉండదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలిలో ఆశాదీపికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వుత్తుల ర్యాలీ లో ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత తొలిచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు భరతజాతి మరువదన్నారు. భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలు గర్వించే ..బిపిన్ రావత్ జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శనీయమని అన్నారు.బిపిన్ రావత్ తో పాటు అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola