Deepak Chahar Crying : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమి
Continues below advertisement
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ నిరాశ గా కనిపించాడు. చాహర్ 34 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేసి భారత్ లక్ష్యాన్ని చేరువ చేయడంలో సహాయపడ్డాడు. 48వ ఓవర్‌లో ఔట్ అయిన తర్వాత, నిరాశ చెందుతూ ఒంటరిగా కూర్చున్నాడు. ఇండియా నాలుగు పరుగుల తేడా తో ఓడిపోయిన తర్వాత దీపక్ చాహర్ కంటతడి పెట్టడం కనిపించింది.
Continues below advertisement